ఉద్ధవ్ థాక్రేతో సూపర్ స్టార్ రజినీకాంత్ భేటీ.. అందుకేనంటూ జోరుగా ప్రచారం..!

by Javid Pasha |   ( Updated:2023-03-18 11:09:04.0  )
ఉద్ధవ్ థాక్రేతో సూపర్ స్టార్ రజినీకాంత్ భేటీ.. అందుకేనంటూ జోరుగా ప్రచారం..!
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్ మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేను ముంబైలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ కుటుంబ సభ్యులు రజినిని బొకేతో సన్మానించారు. మహారాష్ట్రలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రజినీకాంత్.. థాక్రేను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో రజిని.. ఉద్ధవ్ భేటీపై సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రచారం జరుగుతోంది. త్వరలోనే రజినీకాంత్ ఉద్ధవ్ థాక్రే శివసేనలో చేరబోతున్నారని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుంటే.. అలాంటిదేమీ లేదు.. బాలాసాహెబ్ థాక్రే అంటే రజినికి అపారమైన గౌరవమని, ఆ గౌరవంతోనే ఆయన కుటుంబ సభ్యులను కలిశారని రజిని ఫ్యాన్స్ చెబుతున్నారు.

కాగా బీజేపీ సహకారంతో శివసేన పార్టీని రెండుగా చీల్చి ఏక్ నాథ్ షిండే సీఎం అయిన విషయం తెలిసిందే. ఇక అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో శివసేన పార్టీని, ఆ పార్టీ గుర్తును ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేనకు అప్పగిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ అనే మూవీతో రెండేళ్ల గ్యాప్ తర్వాత ఫ్యాన్స్ కు ముందుకు రానున్నాడు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

Also Read..

ప్రభాస్ ఏంటీ ఇలా మారిపోయాడు..? అసలు విషయం ఇదే..!

Advertisement

Next Story

Most Viewed