సినిమా విడుదలకాగానే హిమాలయాలకు వెళ్లిపోతున్న రజనీకాంత్!

by samatah |   ( Updated:2023-08-10 09:32:18.0  )
సినిమా విడుదలకాగానే హిమాలయాలకు వెళ్లిపోతున్న రజనీకాంత్!
X

దిశ, సినిమా: కోలివుడ్ సూపర్ స్టార్‌ రజనీకాంత్ ప్రశాంతత కోసం, ఆరోగ్యం కోసం తరుచు హిమాలయాలకు వెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఎక్కువ సమయం కుటుంబంతో కాకుండా హిమాలయాల్లో గడుపుతారు. అయితే రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌’ మూవీ ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొన్నటి వరకు సినిమా ప్రమోషన్స్‌‌తో బిజీగా ఉన్న ఆయన మూవీ విడుదలకాగానే హిమాలయాలకు వెళ్తున్నట్లు చెప్పాడు. ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ ఇతర కారణాల వల్ల హిమాలయాలకు వస్తున్నట్లు సమాచారం. దాదాపు నాలుగు వారాల పాటు అక్కడే ఉండబోతున్నాడట రజనీ.

Read More..

హైదరాబాద్‌కు తమిళ జైలర్ ఎంట్రీ.. పూనకాలతో ఊగిపోయిన ఫ్యాన్స్.. ఫొటోలు వైరల్

Advertisement

Next Story