పేద పిల్లలకు అండగా సూపర్ స్టార్ మహేష్ బాబు

by sudharani |   ( Updated:2023-07-10 11:50:22.0  )
పేద పిల్లలకు అండగా సూపర్ స్టార్ మహేష్ బాబు
X

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూ.. మరోవైపు కమర్షియల్ యాడ్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఒకటి రెండు కాదు కూల్ డ్రింక్స్, ఫుడ్ నుంచి దుస్తులు, వాచెస్ ఇలా చాలా ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఇక ఇప్పటికే కేవలం పిల్లల కోసం సొంతంగా ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఉచిత హార్ట్ ఆపరేషన్ చేయిస్తున్న మహేష్.. తాజాగా పేద పిల్లలకు వైద్యాన్ని అందించే ‘Heal a Child’ అనే ఓ ఎన్జీఓ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‏గా ఉన్నారు. సోమవారం జూలై 10 ఈ సంస్థ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి మహేష్ తన భార్య నమ్రతతో కలిసి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతుండగా మహేష్ గొప్ప మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.

Advertisement

Next Story