కొడుకు కోసం సంచలన నిర్ణయం తీసుకున్న సుమ.. ఏకంగా ఆ హీరోయిన్‌కే ఎసరు పెట్టిందిగా?

by Anjali |
కొడుకు కోసం సంచలన నిర్ణయం తీసుకున్న సుమ.. ఏకంగా ఆ హీరోయిన్‌కే ఎసరు పెట్టిందిగా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు. ‘స్టార్ మహిళ, అవాక్కయ్యారా, జీన్స్, పంచావతారం, సూపర్ సింగర్, భలే చాన్సులే, పట్టుకుంటే పట్టుచీర, లక్కు, కిక్కు’’ వంటి షో లతో బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు సంపాదించుకుంది సుమ. ఇక టాలీవుడ్ స్టార్ హీరోల ప్రీ రిలీజ్ కార్యక్రమాలకైతే సుమ తప్పనిసరిగా ఉండాల్సిందే.

ఇకపోతే ఈ యాంకర్ తన కుమారుడిని కూడా ఇండస్ట్రీ వైపు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రీసెంట్ గా తెరకెక్కిన ‘బబుల్ గమ్’ సినిమాలో హీరోగా నటించాడు. మానస చౌదరి కథానాయికగా నటించిన ఈ మూవీ యువతను బాగా ఆకట్టుకున్నప్పటికీ బాక్సాఫీసు వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కాగా రోషన్ కనకాల రెండో సినిమా విషయంలో సుమ చాలా స్ట్రిక్ట్ గా ఉందట. ఇందుకోసం సుమ ఓ హీరోయిన్ కు కోట్ల పారితోషికం ఇచ్చైనా సరే తన కొడుకు సినిమాలో ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యిందట.

మరీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. బేబీ సినిమాతో బాక్సాఫీసును షేక్ చేసిన వైష్ణవి చైతన్య. ఆల్రెడీ రోషన్ తన రెండో చిత్రానికి సంబంధించి సైన్ కూడా చేశాడట. కాగా వైష్ణవి చైతన్య ను హీరోయిన్ గా తీసుకునే ప్లాన్ లో సుమ ఉందంటూ.. వైష్ణవిని బాగా రిక్వెస్ట్ చేయడంతో చివరకు బేబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ జనాలు నెట్టింట చర్చించుకుంటున్నారు. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సుమ పై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed