- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sudigaali Sudheer : ‘గోట్’ మూవీ డైరెక్టర్ చేంజ్.. విభేదాలే కారణమా?
దిశ, సినిమా: జబర్దస్త్ ఫేమ్ తెచ్చకున్నవారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్న సుధీర్ వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'గోట్' గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్స్ అనేది ఈ చిత్రం ఉపశీర్షిక. విశ్వక్‌సేన్ కథానాయకుడిగా నటించిన 'పాగల్' మూవీకి దర్శకత్వం వహించిన నరేష్ కుప్పలి దర్శకుడు మహాతేజ క్రియేషన్స్ పతాకంపై మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా అరవై శాతం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. అయితే తాజాగా మూవీ దర్శకుడిని మారుస్తున్నట్లుగా తెలిసింది.
నరేష్ స్థానంలో మరో దర్శకుడితో మిగతా బ్యాలెన్స్ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నట్లుగా సమాచారం. సోమవారం మేకర్స్ విడుదల చేసిన ప్రమోషన్ కంటెంట్‌లో కూడా అతడి పేరును తొలగించారు. దర్శకుడికి, నిర్మాతకు విభేదాల వల్ల నరేష్‌ను ఈ సినిమా నుంచి తప్పిస్తున్నట్లుగా తెలిసింది. దీంతో పాటు నిర్మాత అనుకున్న బడ్జెట్‌ను మించి పోతుందని, ఇందుకు దర్శకుడే కారణమని భావించిన నిర్మాత, ఇక దర్శకుడిని మార్చే ప్రయత్నంలో వున్నాడట. దివ్యభారతి నాయికగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి అయ్యో పాపం సారు అనే పాట విడుదలై వైరల్‌గా మారింది. ఈ పాటకు ఇప్పటి వరక 7 మిలియన్ వ్యూస్ లభించడం విశేషం.