రష్మికి బిగ్ షాక్.. ఆమెతో నిశ్చితార్థం చేసుకున్న సుధీర్?

by samatah |   ( Updated:2023-06-30 05:59:38.0  )
రష్మికి బిగ్ షాక్.. ఆమెతో నిశ్చితార్థం చేసుకున్న సుధీర్?
X

దిశ, వెబ్‌డెస్క్ : బుల్లితెర హీరోగా పేరు తెచ్చుకున్న సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన జబర్దస్త్ కమెడీ షో ద్వారా మంచి పేరు సంపాదించారు. అంతే కాకుండా యాంకర్‌గా కూడా సుధీర్‌కు మంచి పేరు ఉంది. ఇక జబర్ధస్త్‌తో మంచి పాపులారిటీ రావడంతో సినిమాల్లో అవకాశాలు రావడంతో అటువైపు వెళ్లిపోయాడు. ఇక సుధీర్, యాంకర్ రష్మీ పెళ్లి చేసుకున్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ, ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.

అంతే కాకుండా ఈ జంటకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నవారు లక్షల్లోనే ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. సుధీర్ తన మదరల‌తో ఏకంగా నిశ్చితార్థం చేసుకున్నాడంటూ ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తన సొంత మరదలని సుధీర్ నిశ్చితార్ధం చేసుకున్నాడు అని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ రష్మీ సుధీర్ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు. ఇంకొంత మంది రష్మికి బిగ్ షాక్ తగిలిందంటూ ముచ్చటిస్తున్నారు.

Advertisement

Next Story