టాలీవుడ్ నుంచి ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లికి హాజరైన తారలు

by Prasanna |   ( Updated:2024-07-14 08:26:44.0  )
టాలీవుడ్ నుంచి ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లికి  హాజరైన తారలు
X

దిశ,సినిమా: జియో తో సూపర్ సక్సెస్ అయినా ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దేశం మొత్తం ఈ పేరే ఎక్కువగా వినబడుతోంది ఎందుకంటే ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం ఈ రోజు జరగనుంది. దీని కోసం భారీ ఏర్పాట్లు కూడా చేసారు. ఇప్పటికే వేల మంది అతిథులు హాజరయ్యారు. అయితే, ముంబైలోని స్టార్ హోటళ్లు మొత్తం ఫుల్ అయ్యాయి. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి సెలబ్రిటీస్ హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది.

ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ నుంచి కొంతమంది సెలబ్రిటీస్ హాజరయ్యారు. రాధికా మర్చంట్ ల వివాహం.. ముంబాయ్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. రిసెప్షన్ వేడుకకు మిగతా వాళ్ళు కూడా హాజరవుతారని సమాచారం. కొందరైతే జియో సిమ్ కార్డు వాడే వాళ్ళని కూడా పిలుస్తారని చాలా మంది ఆశ పడ్డారు కానీ, వారి ఆశలు అడియాశలు అయ్యాయి అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story