Sara Ali Khan : వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న స్టార్ కిడ్..

by sudharani |   ( Updated:2024-05-22 04:45:10.0  )
Sara Ali Khan : వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న స్టార్ కిడ్..
X

దిశ, సినిమా: బిటౌన్ స్టార్ కిడ్, నటి సారా అలీఖాన్.. స్టార్ హీరో సైప్ అలీఖాన్ కూతురిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. విభిన్న పాత్రలు చేస్తూ.. తన నటనతో, అందంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే ‘ఏ వతన్ మేరే వతన్’, ‘మర్డర్ ముబారక్’ వంటి సినిమాతో ప్రేక్షకులను అలరించిన సారా.. తొందరపాటుతో కాకుండా కెరీర్‌లో ఆచితూచి అడుగులు వేస్తుంది. ప్రజెంట్ వరుస ప్రాజెక్టులకు ఓకే చెప్తున్న బాలీవుడ్ బ్యూటీ చేతిలో మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే.. తాజా సమాచారం మేరకు ఈ ప్రాజెక్ట్‌లతో పాటు మరో కొత్త సినిమాకు ఓకే చెప్పేసింది సారా. స్పై యాక్షన్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆకాశ్ కౌశిక్ దర్శకత్వం వహించనున్నారు. కరణ్ జోహార్ నిర్మాణంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరో కాగా.. సారా హీరోయిన్‌గా ఫైనల్ అయింది. ఇక తాజాగా షూటింగ్ పనులు కూడా స్టార్ట్ చేసింది మూవీ టీం. అయితే.. మూవీ టైటిల్ మాత్రం ఇంకా రివీల్ చెయ్యలేదు.

Advertisement

Next Story