ప్రవేట్ విమానం కొనుగోలు చేసిన నయనతార.. ఎన్ని కోట్లో తెలుసా?

by Anjali |   ( Updated:2023-09-29 09:03:51.0  )
ప్రవేట్ విమానం కొనుగోలు చేసిన నయనతార.. ఎన్ని కోట్లో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం తెలుగు, మలయాళం, తమిళంతో పాటు హిందీలోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. తాజాగా నయన్ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌తో కలిసి ‘జవాన్’ చిత్రంలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సినిమా రిలీజైన మొదటి రోజే సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే.. మొన్నటి వరకు నయనతార ఆస్తుల గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ భామ ప్రైవేట్‌ జెట్‌ కొనుగోలు చేసిందంటూ జనాలు నెట్టింట చర్చించుకుంటున్నారు. అయితే నయన్ కొనుగోలు చేసిన ప్రైవేట్ జెట్ విలువ రూ.50 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. కాగా.. సౌత్ ఇండియాలో ‘ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రవేటు జెట్‌ను కలిగున్న ఏకైక నటి అంటే నయనతారే.’ అంటూ నెటిజన్లు నయన్‌కు శుభాకాంక్షలు చెబుతూ ఈ అమ్మడును పొగిడేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed