మా విడాకులకు ఆ స్టార్ హీరోయినే కారణం.. ఆమెను ఎప్పటికీ క్షమించను: సింగర్ షాకింగ్ కామెంట్స్

by sudharani |   ( Updated:2023-07-12 12:46:52.0  )
మా విడాకులకు ఆ స్టార్ హీరోయినే కారణం.. ఆమెను ఎప్పటికీ క్షమించను: సింగర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సింగర్ సుచిత్రా కృష్ణమూర్తి (Suchitra Krishnamoorthi) తన మాజీ భర్త అయినా బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్‌తో విడిపోవడంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఈ జంట 2007లో విడిపోయారు. అయితే.. శేఖర్ కపూర్ తనతో నిజయితీగా లేడని.. అతని ప్రేమలో నిజం లేదని సింగర్ సుచిత్ర సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బహిరంగంగా ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఆమె మాట్లాడుతూ.. మా విడాకులకు ప్రీతి జింటానే కారణమైంది. మా దంపతుల మధ్య దూరి చిచ్చు పెట్టింది. ఆమెను నేను ఎప్పటికీ క్షమించను అంటూ చెప్పుకొచ్చారు.

అయితే దీనిపై స్పందించిన ప్రీతి జింటా.. సినీ ఇండస్ట్రీలో నేను నెంబర్ వన్ హీరోయిన్‌గా ఉన్నాను. సుచిత్ర కనీసం నటించడం లేదు. ఆమె గృహిణిగా పరిమితమైంది. అలాంటి వారికి నా గురించి మాట్లాడే అర్హత లేదు. ఆమె మానసిక స్థితి సరిగా లేనట్లు ఉంది అంటూ కౌంటర్ వేసింది.

Read More: రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన యంగ్ హీరోహీరోయిన్లు.. ఇదేం టేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్

Advertisement

Next Story