తనకంటే 9 ఏళ్ల చిన్నవాడితో స్టార్ హీరోయిన్ ఎంగేజ్మెంట్.. సంచలనం సృష్టిస్తున్న పోస్ట్!

by Hamsa |
తనకంటే 9 ఏళ్ల చిన్నవాడితో స్టార్ హీరోయిన్ ఎంగేజ్మెంట్.. సంచలనం సృష్టిస్తున్న పోస్ట్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు హిందీలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘నేనొక్కడినే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీతోనే తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేసింది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఆదిపురుష్ మూవీలో సీతగా నటించింది. కానీ ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటుగా విమర్శలు ఎదుర్కొంది. దీంతో కృతి బాలీవుడ్ చెక్కేసింది. ప్రజెంట్ ధనుష్‌తో ఓ మూవీ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇక కృతి సనన్ పర్సనల్ విషయానికొస్తే.. ఈ అమ్మడు తనకంటే 9 ఏళ్లు చిన్నవాడైన కబీర్ బహియాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ ఆ పోస్ట్ ఎవరు పెట్టారా అని ఆశ్చర్యపోతున్నారు కృతి ఫ్యాన్స్. అయితే పోస్ట్ పెట్టింది ఆమె కాదు సినీ క్రిటిక్ ఉమైర్ సందు సోషల్ మీడియాలో కృతి సనన్ నిశ్చితార్థం గురించి పోస్ట్ పెట్టడంతో అది కాస్త నెట్టింట సంచలనంగా మారింది. కానీ ఫ్యాన్స్ మాత్రం కొట్టిపారేస్తున్నారు. నీకు బుద్ధి రాదా ఇగ అని ఉమైర్ సందుని తిట్టిపోస్తున్నారు. ఇక కృతి ఎంగేజ్మెంట్ జరిగిందా లేదా అనేది తెలియాలంటే ఆమె స్పందిస్తే కానీ అసలు విషయంపై క్లారిటీ రాదు.

Advertisement

Next Story