సినిమాలకు దూరమైన షారుఖ్ ఖాన్.. విశ్రాంతి తీసుకుంటున్నా అనడంతో ఆందోళనలో ఫ్యాన్స్

by Hamsa |   ( Updated:2024-05-04 13:11:15.0  )
సినిమాలకు దూరమైన షారుఖ్ ఖాన్.. విశ్రాంతి తీసుకుంటున్నా అనడంతో ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఏడాది వ్యవధిలో ఏకంగా మూడు భారీ విజయాలు అందుకున్నాడు. షారుఖ్ గత ఏడాది నటించిన పఠాన్, జవాన్, డంకీ థియేటర్స్‌లో విడుదలై బాక్సాఫీసును బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. దీంతో షారుఖ్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఈ క్రమంలో షారుఖ్ సినిమాలకు దూరమైవుతున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘మూడు సినిమాలతో గత ఏడాది మొత్తం బిజీగా గడిపాను. శరీరాన్ని చాలా కష్టపెట్టాను షూటింగ్‌లో కొన్ని సీన్స్ చేసి.

అందుకే ఇప్పుడు కొంచెం బాడీకి రెస్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అలాగే ప్రజెంట్ ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడే ప్రతి మ్యాచ్‌కు నేను వస్తానని జట్టుకు మాటిచ్చాను. అందుకే నా నెక్ట్స్ సినిమా షూటింగ్ జూన్‌లో సెట్ మీదకు తీసుకొచ్చేలా ప్లాన్ చేశాను. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూనే.. ఐపీఎల్ మ్యాచ్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. నేను ఇక్కడే ఉండండ ముఖ్యం కాబట్టి అన్ని మ్యాచ్‌లకు హాజరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాను. మాట నిలబెట్టుకోవడానికి ఎలాగైనా వెళతాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం షారుఖ్ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు.

Read More..

రాజకీయాల్లోకి స్టార్ హీరోయిన్ జ్యోతిక.. ఎట్టకేలకు క్లారిటీ ఇస్తూ ఆసక్తికర కామెంట్స్!

Advertisement

Next Story

Most Viewed