అభిమానికి షేక్ హ్యాండ్ ఇచ్చి.. డెటాల్‌తో చేయి కడుకున్న స్టార్ హీరో Ajith Kumar

by Anjali |   ( Updated:2023-08-30 03:47:40.0  )
అభిమానికి షేక్ హ్యాండ్ ఇచ్చి.. డెటాల్‌తో చేయి కడుకున్న స్టార్ హీరో Ajith Kumar
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. షూటింగుల్లో బిజీ బిజీగా గడుపుతోన్న అజిత్.. తాజాగా తన ఫ్యాన్స్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఓ అభిమాని ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అనంతరం అజిత్ డెటాల్‌తో చేతిని కడుకున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ‘‘ఇదేం పైత్యం రా బాబు, నీకు అంతలా ఇబ్బంది ఉంటే షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఉండాల్సింది, అందరి ముందు పరువు తీసుకోవడం అవసరమా? అసలు వాళ్లే లేకపోతే ఇంత స్టార్ డమ్ ఎక్కడిది’ అంటూ తీవ్రంగా మండిపడుతూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story