- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ajith Kumar: సినిమాలకు బ్రేక్ ఇచ్చిన స్టార్ హీరో.. షాక్‌లో ఫ్యాన్స్!
దిశ, సినిమా: స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న పాన్ ఇండియా ప్రెస్టీజియస్ మూవీ ‘విడాముయర్చి’. లైకా ప్రొడక్షన్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాతో పాటు అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. అయితే.. తాజాగా అజిత్‌కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
‘విడాముయర్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలను సాధ్యం అయినంత తొందరలో కంప్లీట్ చేసుకుని.. చిత్రాలకు కొన్ని నెలలు విరామం తీసుకోవాలని అనుకుంటున్నారని టాక్. ఒక ఆరు నెలల గ్యాప్ ఇచ్చి.. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ హీరోకు బైక్ రైడింగ్ అంటే ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఇక బైక్ రైడింగ్‌కు కూడా వెళ్లనున్నారట. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.