బాలీవుడ్‌లో మరో అవకాశం కొట్టేసిన శ్రీలీల.. హీరో ఎవరంటే!

by Hamsa |   ( Updated:2024-07-06 11:38:26.0  )
బాలీవుడ్‌లో మరో అవకాశం కొట్టేసిన శ్రీలీల.. హీరో ఎవరంటే!
X

దిశ, సినిమా: టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల గతంలో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ హోదాలో ఇండస్ట్రీని షేక్ చేసింది. కానీ వరుసగా నాలుగు ఫ్లాప్‌లు తన ఖాతాలో పడటంతో.. అమ్మడు క్రేజ్ అమాంతం పడిపోయింది. దీంతో కొద్ది కాలంగా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి పలు యాడ్స్ చేసింది. ప్రస్తుతం మళ్లీ శ్రీలీల రవితేజ, నితిన్‌ సినిమాలతో సినీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తోంది. అలాగే పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలోనూ నటిస్తుంది. అమ్మడు మళ్లీ వరుస అవకాశాలు అందుకుంటూ ఇంతకుముందు ఉన్న క్రేజ్‌ను సంపాదించుకునే ప్రయత్నం చేస్తోంది.

నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లను మాయ చేస్తుంది. శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. వైట్ షర్ట్ బ్లాక్ షూస్, సూట్ ధరించి మత్తెక్కించే చూపులతో స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చి యూత్‌కి నిద్రలేకుండా చేస్తుంది. అంతేకాకుండా ‘‘కళ్లల్లో ఫైర్.. మాటల్లో స్పష్టత ఉంటుంది. కాబట్టి వీటిని తినండి’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇదిలా ఉంటే.. తెరపైకి ఓ షాకింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. శ్రీలీల, అర్జున్ కపూర్ కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు టాక్. దానికి కారణం అమ్మడు పోస్ట్‌కి అతను లైక్ కొట్టడంతో నెట్టింట ఓ ప్రచారం మొదలైంది. సినిమా చేస్తున్నారు కాబట్టే అలా చేశాడని అంతా అనుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed