- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ హీరోయిన్ నుంచి హోస్టుగా మారిన శ్రీలీల.. ఆయన కోసమేనా..?
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం టాలీవుడ్‌లో శ్రీలీల క్రేజ్ మాములుగా లేదు. కుర్ర హీరో నుంచి ముదుసలి హీరో వరకు ఆమెతో ఆడిపాడేందుకు పోటీ పడుతున్నారు. పెళ్లి సందడి మూవీతో ఈ క్యూట్ బ్యూటీ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఈ సినిమా కేవలం హీరోయిన్ వల్లే హిట్ కావడంతో ఇండస్ట్రీలో శ్రీలలకు మంచి గుర్తింపు వచ్చింది. రవితేజ సరసన నటించిన ‘ధమాకా’ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు తన్నుకు వచ్చాయి. అమ్మడు వరుసగా ఒకేసారి పది సినిమాలకు సైన్ చేయడం గమనార్హం.
ఇదిలా ఉంటే ఈ నటికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇటీవల కన్నడ షో కోసం శ్రీలీల హోస్ట్‌గా మారబోతున్నారని టాక్ వినిపించింది. అంతే కాదు ఆ షో కోసం ఈ అమ్మడు కొన్ని సినిమాల నుంచి కూడా తప్పుకుందని ఆ మధ్య గుసగుసలు వినిపించాయి. దీనిపై కొందరు డబ్బుకోసం తను హోస్ట్‌గా చేయబోతున్నాని కామెంట్స్ చేశారు. తాజాగా వీటిపై హీరోయిన్ స్పందిస్తూ.. మనీ కోసం నేను ఈ హోస్ట్ చేయడం లేదని, తన తల్లికి బెస్ట్ ఫ్రెండ్ అయినా డైరెక్టర్ కోరిక మేరకు మాత్రమే ఈ షోని హోస్ట్ చేయడానికి ఒప్పుకున్నానని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఫిల్మ్ నగర్‌లో జరుగుతున్న ఊహాగానాలకు పులిస్టాఫ్ పడింది.