బాడీ పెంచు మేనేజ్ చేద్దామన్నాడు.. జబర్దస్త్ మానేయడానికి అసలు కారణం బయటపెట్టిన స్టార్ యాంకర్

by Anjali |
బాడీ పెంచు మేనేజ్ చేద్దామన్నాడు.. జబర్దస్త్ మానేయడానికి అసలు కారణం బయటపెట్టిన స్టార్ యాంకర్
X

దిశ, సినిమా: బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే లెజెండరీ కామెడీ షో ‘జబర్దస్త్’ షో. ఈ షో ఎంతో మంది సామాన్యులకు లైఫ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. బుల్లితెర ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసిన కమెడియన్లు ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల్లో నటించే స్థాయికి వెళ్లారు. ఇకపోతే లేడీ యాంకర్లైన.. రష్మీ గౌతమ్, అనసూయ కూడా పలు సినిమాల్లో మెయిన్ లీడ్ పోషిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

వీరి నటనతో ఆడియన్స్ మన్నన పొందుతున్నారు. అయితే అనసూయకు బుల్లితెరకు గుడ్‌బై చెప్పి.. వెండితెరకు చెక్కెసిన విషయం తెలిసిందే. ఈమె స్థానంలో సౌమ్యరావు అనే అమ్మాయి జబర్దస్త్, ఎక్స్ ట్రా బజర్దస్త్ యాంకర్ గా చేసింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయింది. రీసెంట్ గా ఈ అమ్మడు జబర్దస్ లో యాంకరింగ్ మానేయడానికి గల కారణాలేంటో చెప్పుకొచ్చింది.

‘‘కొంతమందికి యాంకరింగ్ చేయడం నచ్చితే.. మరికొందరికి అస్సలు ఇష్టం ఉండదు. నాకు సరిగ్గా తెలుగు రాదు. తెలుగులో అందమైన అమ్మాయిలు ఎందరో ఉన్నారు. అప్పుడు నన్ను ఎందుకు తీసుకుంటారు. నాకు స్కిట్ లో కొన్ని జోక్స్ కూడా అర్థం కావు. నేను తెలుగులో మాట్లాడితే కొంతమంది దరిద్రంగా ఉందని చెప్పారు.

నాకు డాన్స్ కూడా రాదు. డాన్స్ ప్రాక్టీస్ కు వెళ్లాను. డాన్స్ క్లాసెస్ కు వెళ్తే ఇంకా సన్నగా అయిపోతున్నాను. దీంతో జబర్దస్త్ డైరెక్టర్ నన్ను.. నువ్వు డాన్స్ ప్రాక్టీస్ చేయకు. ఇంకా సన్నగా అయితే అస్సలు బాగుండవు. బాగా తిని బాడీ పెంచు. డాన్స్ ఏదోలా మేనేజ్ చేయండి. అని అన్నారు. నాలోని పలు లోపాల వల్ల జబర్దస్త్ ను వదిలేయాల్సి వచ్చింది.’’. అంటూ సౌమ్య రావు వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed