- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Raveena Tandon: చాలా పెద్ద తప్పు చేశాను క్షమించండి.. రవీనా టాండన్ ఎమోషనల్ పోస్ట్
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ బ్యూటీ రవీనా టాండన్ ఇటీవల లండన్‌కు వెళ్లింది. అక్కడ నడుచుకుంటూ వెళ్తుండగా.. ఆమె అభిమానులు చూసి సెల్ఫీ దిగడానికి దగ్గరకు వెళ్తే ఆమె నిరాకరించింది. అంతేకాకుండా సెక్యూరిటీని పిలిచి వారిని అడ్డుకునేలా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, రవీనా ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘హాయ్, ఇది కేవలం రికార్డ్ చేయడానికి మాత్రమే. కొన్ని రోజుల క్రితం లండన్‌లో, నేను నడుచుకుంటూ వెళుతుండగా, కొంతమంది మగవాళ్ళు నా దగ్గరకు వచ్చారు. అక్కడ నేరాల పరిస్థితి వల్ల వాళ్లు రావడంతో నేను కొంచెం భయపడ్డాను.
నేను ఒంటరిగా ఉన్నందున వద్దు అని చెప్పి మరింత వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాను. కొన్ని నెలల క్రితం బాంద్రాలో జరిగిన సంఘటన తర్వాత నన్ను కొంత భయాందోళనకు గురి చేసింది. అందుకే నేను జాగ్రత్తలు తీసుకుంటున్నాను. కానీ కారు ఎక్కిన కొంత సమయం తర్వాత వారికి ఫొటో ఇవ్వాలని నా మనసుకు అనిపించింది. కానీ ధైర్యం చేసి మళ్లీ తిరిగి వెనక్కి వెళ్లలేకపోయాను. వారితో అలా ప్రవర్తించి చాలా పెద్ద తప్పు చేశాను. ఈ సంఘటన తర్వాత నేను చాలా బాధపడ్డాను.
వారు చదువుతున్నట్లయితే ఈ పోస్ట్ ద్వారా వారికి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నా పరిస్థితి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. భవిష్యత్తులో మిమ్మల్ని మళ్లీ కలిసే అవకాశం వస్తుందని కోరుకుంటున్నాను. అప్పుడు మీతో ఫొటోలు తప్పకుండా దిగుతా. నేను అందుబాటులో ఉండేలా సాధారణంగా ఉండటానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. కానీ నేను కొన్ని సమయాల్లో విఫలమవుతాను. కాబట్టి క్షమించండి అబ్బాయిలు. మీరు దీన్ని చదివి విషయం తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను. నేను భయపడాల్సిన అవసరం లేదు’’ అని రాసుకొచ్చింది.