వారానికి 5 రోజులు.. ప్రతిరోజు 10 నిమిషాలు: ఫిట్‌నెస్ రహస్యం అదే

by sudharani |   ( Updated:2023-07-08 13:26:21.0  )
వారానికి 5 రోజులు.. ప్రతిరోజు 10 నిమిషాలు: ఫిట్‌నెస్ రహస్యం అదే
X

దిశ, సినిమా : హాట్ బ్యూటీ సొనాలీ సెగల్ ప్రతిరోజు తప్పకుండా వ్యాయమం చేయాలంటోంది. అంతేకాదు రోజువారి దినచర్యలో భాగంగా కేవలం పదినిమిషాల యోగా లేదా ఎక్సర్‌సైజ్‌ను చేర్చాలని అభిమానులను కోరింది. అలాగే నిద్ర లేచిన తర్వాత చాలామంది ఖాళీగా కూర్చుంటారన్న ఆమె.. ఆ సమయాన్ని వ్యాయామం చేసేందుకు వెచ్చించాలని సూచించింది.

'తరచుగా ఇలాంటి పనులు చేయడానికి ఏదో ఒక సాకు వెతుక్కుంటాం. కానీ, అలా నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కొన్ని నిమిషాల సమయాన్ని మీ శ్రేయస్సు కోసం వెచ్చించండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వారంలో ఐదు రోజులపాటు రోజూ 30 నిమిషాల చొప్పున మొత్తం 150 నిమిషాల వ్యాయామం చేయాలని సిఫారసు చేస్తోంది. కనీసం 10 నిమిషాల సమయమైనా వెచ్చించండి' అని అభిమానులకు రిక్వెస్ట్ చేసింది.

Advertisement

Next Story