టీఆర్‌పీ రేటింగ్‌ల కోసం హద్దులు మీరను: లిప్‌లాక్ కాంట్రవర్సీపై Sonarika Bhadoria

by Hamsa |   ( Updated:2022-12-05 09:48:01.0  )
టీఆర్‌పీ రేటింగ్‌ల కోసం హద్దులు మీరను: లిప్‌లాక్ కాంట్రవర్సీపై  Sonarika Bhadoria
X

దిశ, సినిమా: హిందీ టెలివిజన్ నటుడు ఆశిష్‌తో లిప్‌లాక్ సన్నివేశంపై నటి సొనారికా భడోరియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 2018లో వచ్చిన 'పృథ్వీ వల్లభ్' ధారావాహికలో వీరిద్దరి మధ్య ఇంటిమేట్ సీన్ తెరకెక్కించగా అప్పట్లో చర్చనీయాంశమైంది. కాగా ఇటీవల ఓ ఇంటరాక్షన్‌లో ఇందుకు సంబంధించిన ప్రశ్నలకు బదులిచ్చిన ఆమె.. తన నిజ జీవితంలోనూ ఇప్పటివరకు ఎవరితో ముద్దు పంచుకోలేదని స్పష్టం చేసింది. ఇక ఆ సీరియల్‌లో ముద్దు సన్నివేశాన్ని తామిద్దరం నిర్మొహమాటంగా నిరాకరించామని, తమ మధ్య లిప్ లాక్ సన్నివేశం ప్లాన్ చేసినప్పటికీ ఆన్ స్ర్కీన్‌పై అలా చేయలేమని చెప్పడంతో మేకర్స్ కూడా అర్థం చేసుకున్నట్లు తెలిపింది. అయితే ఆ సన్నివేశం స్క్రిప్ట్‌లో అంతర్భాగమైనందున కెమెరా యాంగిల్స్ మార్చి చూపించారన్న నటి.. ఆ ఫొటోలు వైరల్ కావడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పింది. చివరగా TRP రేటింగ్‌ల కోసం హద్దులు మీరాలనుకోవట్లేదని క్లారిటీ ఇచ్చిన సొనారిక.. ఇతరులతో తన పెదాలను లాక్ చేయడానికి ఎలాంటి భయం లేదని, భవిష్యత్తులో అత్యవసరమైతే తప్పకుండా చేస్తానని వెల్లడించింది.

Also Read: ఆ పరిస్థితే వస్తే సినిమాలు మానేసి జాబ్ చేసుకుంటా..?? Keerthy Suresh షాకింగ్ కామెంట్స్..!!

Advertisement

Next Story