- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తన లాగే ఉండే మరో వ్యక్తి కోసం ఎందుకంత తాపత్రయం.. హీరోయిన్ సోనాలి షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సోనాలి బింద్రే ఒకరు. మోడలింగ్‌తో కెరీర్ స్టార్ చేసిన ఈమె.. 19 ఏళ్లకే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మంచి సక్సెస్ అందుకున్న సోనాలి.. భాషతో సంబంధం లేకుండా తెలుగుతో పాటు తమిళ, హిందీలో ఎన్నో సినిమాలు చేసింది. స్టార్ హీరోల పక్కన నటించి మంచి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అయితే.. పెళ్లి అయిన తర్వాత అనుహ్యంగా క్యాన్సర్ భారీన పడిన సోనాల్.. అందులో నుంచి కోలుకుని సుదీర్ఘ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. ‘ది బ్రోకెన్ న్యూస్’ సీజన్2 తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈమె.. ప్రస్తుతం పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. ఫ్యాన్స్ కల్చర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఆమె మాట్లాడుతూ.. ‘నాకోసం ఓ అభిమాని సూసైడ్ చేసుకున్నారని తెలిసింది. నన్ను చూడటం కుదరలేదని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారట. ఇది చాలా బాధకరమైన విషయం. నాకు ఒక్కోసారి ఫ్యాన్స్ నుంచి లెటర్స్ వచ్చేవి. వాటిలో కొన్ని బ్లడ్‌తో రాసి ఉండేవి. అవి చూసి షాక్ అయ్యేదాన్ని. చాలా బాధేసేది. అభిమానించడం తప్పు కాదు.. కానీ తన లాంటి వేరే వ్యక్తి గురించి ఇంతలా తాపత్రయపడుతూ ఇలాంటి చెయ్యడం తప్పు’ అంటూ చెప్పుకొచ్చింది.
- Tags
- Sonali Bendre