ఆ కారణంతోనే తమన్న ‘భోళా శంకర్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాలేదట!

by Anjali |   ( Updated:2023-08-07 12:03:25.0  )
ఆ కారణంతోనే తమన్న ‘భోళా శంకర్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాలేదట!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘భోళా శంకర్‌’ మూవీతో ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్న కథానాయికగా నటించింది. ఇక ప్రమోషన్‌లో భాగంగా తాజాగా టీమ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌కు చిత్రబృదం మొత్తం పాల్గొన్నప్పటికీ హీరోయిన్ తమన్న మాత్రం హాజరుకాలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ ‘బాస్ సినిమా ఫంక్షన్ ఎందుకు రాలేదు? అంటూ ఫ్యాన్స్ నెట్టింట తమన్నను ప్రశ్నించారు. అయితే సమాచారం ప్రకారం ఆమె ముంబైలో మరో ఈవెంట్‌కు హాజరైంది. ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ ఫ్లోరియన్ హురెల్ ముంబైలో మొట్టమొదటిసారిగా సెలూన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవడంవల్లే బాస్ ఈవెంట్‌కు రాలేకపోయిందట.

Read More: గంగానదిలో నిండా మునిగిన బోల్డ్ బ్యూటీ.. జనాలకు దూరంగా ఉండాలంటూ ట్రోలింగ్

Advertisement

Next Story