మరోసారి సత్తా చాటుతోన్న 'సీతారామం'

by sudharani |   ( Updated:2022-09-10 09:43:07.0  )
మరోసారి సత్తా చాటుతోన్న సీతారామం
X

దిశ, వెబ్‌డెస్క్: దుల్కర్ సల్మాన్ హీరోగా, హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా 'సీతారామం'. ఇప్పటి వరకు థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సినిమా సాధారణ మూవీగా విడుదలై ప్రేక్షకుల మదిని కన్నీటితో బరువెక్కేలా చేసింది. రామ్‌గా దుల్కర్.. సీతగా మృణాల్ ఠాకూర్ నటన అభిమానులను ఆకట్టుకుంటుంది.

రామ్.. సీతకు రాసిన లెటర్‌లో ప్రతి అక్షరానికి ప్రేక్షకులు ఎంతో కనెక్ట్ అవుతున్నారు. ఆ సన్నివేశాలు అన్నీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ''కనిపిస్తోంది.. కన్నీళ్లతో ఈ ఉత్తరం తడవటం, తుడిచేసుకో. వినిపిస్తోంది నన్ను తిరిగి రమ్మనే నీ పిలుపు. నెలకి రూ.600 సంపాదించే సైనికుడి కోసం అన్నీ వదిలేసిన మహారాణి.. ఈ జన్మకు ఇక సెలవు'' అనే డైలాగులు క్నన్నీలు పెట్టిస్తున్నాయని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తున్నారు నెటిజన్స్.

Also Read : 'Sita Ramam ' ఓటీటీ స్ట్రీమింగ్

Advertisement

Next Story