- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉదయ భానును సింగర్ సునీత అవమానించిందా?.. అప్పట్లో ఏం జరిగింది?
దిశ, సినిమా : ఉదయ భాను.. ఈ పేరు వినగానే ఒకప్పుడు మా టీవీలో ప్రసారమైన ‘రేలారె రేలా.. దుమ్ము లేపు’ వంటి ఫేమస్ కార్యక్రమాలు గుర్తుకు వస్తాయ్. దీంతోపాటు ఈటీవీ, జెమినీ టీవీ, పలు ఇతర వేదికల్లోనూ ఈవెంట్లను చేస్తూ స్మాల్ స్క్రీన్‌పై ఓ వెలుగు వెలిగిన ఫేమస్ స్టార్ యాంకర్ ఉదయ భాను. నిజం చెప్పాలంటే సుమ కనకాలకు మించి ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ అండ్ డైనమిక్ యాంకర్ ఆమె. ఏం జరిగిందో కానీ అనుకోకుండా యాంకరింగ్ కెరీర్‌కు దూరమై ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. కాగా అప్పట్లో ఉదయ భాను, సింగర్ సునీతకు మధ్య చోటుచేసుకున్న ఓ ఆసక్తికర సంఘటనకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈవెంట్ ఏదైనా సరే ఉదయ భాను మాట్లాడితే సెలయేటి గల గలలా ఉండేది. ఆమె మాటలు ప్రేక్షకుల్లో జోరు నింపేవి. అనేక కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించింది. అయితే ఉదయ భాను తన కెరీర్‌ను వదులుకోవడానికి గల కారణాలు ఎవరికీ తెలియవు. కాకపోతే రకరకాల రూమర్స్ వినిపించాయి. టెలివిజన్ పరిశ్రమలో ఆమెకు శత్రువులు ఎక్కువయ్యారని కొందరు చెప్తుండేవారు. ఇదిలా ఉండగా అప్పట్లో ఉదయభాను-సింగర్ సునీత మధ్య కోల్డ్ వార్ నడిచిందనే వాదన కూడా ఉంది.
ఓసారి సింగర్ సునీత అమెరికాలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఉదయభానుకు అవమానం జరిగిందట. ఈ మేరకు సునీతను ఉద్దేశిస్తూ అప్పట్లోనే ఆమె పరోక్షంగా తన బాధను కూడా వ్యక్తం చేసింది. అయితే ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సింగర్ సునీత స్పందిస్తూ.. ‘‘ఉదయభానును నేను అవమానించానన్నది కరెక్ట్ కాదు. ఆమె ఫీల్ అవుతున్న విషయం కూడా నాకు తెలియదు. కాకపోతే నాతో సరిగా మాట్లాడేది కాదు. పలకరించినా పట్టించుకోకుండా వెళ్లిపోయేది. దీంతో ఆమె నా గురించి ఏదో తప్పుగా అర్థం చేసుకుందని మాత్రం అర్థమైంది. కానీ నాకు ఆమె మీద ఏ ఉద్దేశాలూ లేవు’’ అంటూ చెప్పుకొచ్చింది సింగర్ సునీత. ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఏం జరిగిందో తెలియదు కానీ ఉదయభాను యాంకరింగ్ మాత్రం బాగుండేదంటూ క్యూరియాసిటీతో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్.