Bollywood Music లో Ghazals ను చేర్చండి: Srijani Ghosh

by Hajipasha |   ( Updated:2022-12-28 13:27:27.0  )
Bollywood Music లో Ghazals ను చేర్చండి: Srijani Ghosh
X

దిశ, సినిమా: ప్రముఖ గజల్ గాయని శ్రీజనీ ఘోష్ బాలీవుడ్ ఇండస్ట్రీలో గజల్స్ చేర్చడానికి ఇంకా అవకాశాలున్నాయని అంటోంది. అందుకే చలనచిత్ర నిర్మాతలు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్స్ తమ సినిమాల్లో, ఆల్బమ్స్‌ సౌండ్ ట్రాక్‌లలో గజల్ యాడ్ చేసేందుకు ఉత్తమమైన మార్గాన్ని కనుగొనాలని కోరింది. ఇక తాను కుడా ఈ తరం యువతకు నచ్చే గజల్స్‌ను అందించాలనుకుంటున్నానని, ఈ శైలికి భారతీయ సినీ పరిశ్రమల్లో, ముఖ్యంగా బాలీవుడ్‌లో మరింత ప్రాధాన్యత లభించాలని భావిస్తున్నట్లు తెలిపింది. 'మనం 10 సంవత్సరాలు వెనక్కి వెళితే.. సినిమాల్లో గజల్స్ ప్రభావం చాలా ఉంది. కానీ, ప్రస్తుత కాలంలో రోజు రోజుకూ అంతరించిపోతోంది. బాలీవుడ్‌లో చేర్చితే మళ్లీ జీవం పోసుకుంటుందని బలంగా నమ్ముతున్నా. మేకర్స్ దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి అనుకుంటున్నారా లేదా అనేది నాలో ప్రశ్న గానే మిగిలిపోతుంది' అని ఘోష్ తెలిపింది. కాగా తాను కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్నప్పటికీ గాయకురాలిగా భారతీయ శాస్త్రీయ సంగీతం, గజల్స్ ప్రాక్టీస్ చేస్తున్నానని, ఇటీవల ఉదయపూర్ (రాజస్థాన్)లో జరిగిన వేదాంత ఉదయ్‌పూర్ వరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇచ్చినపుడు శ్రోతల నుంచి భారీ స్పందన లభించినట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి : 'Lucky Laxman' కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం: Sohail

Advertisement

Next Story

Most Viewed