కండోమ్ చేతిలో పట్టుకుని... ఆరేళ్లు ఆ పని చేశానని ఒప్పుకున్న హీరో సిద్ధార్థ్

by Sujitha Rachapalli |
కండోమ్ చేతిలో పట్టుకుని... ఆరేళ్లు ఆ పని చేశానని ఒప్పుకున్న హీరో సిద్ధార్థ్
X

దిశ, సినిమా: లవర్ బాయ్ సిద్ధార్థ్ 'భారతీయుడు 2' తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనున్న ఆయన.. దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్ గా మీడియాతో జరిగిన ఇంటరాక్షన్ లో పలు విషయాలు షేర్ చేసుకున్నాడు. 'టికెట్ ధర పెంచాలంటే సామాజిక అవగాహన పెంచే కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మీరు ఏం చేద్దామని అనుకుంటున్నారు?' అని మీడియా పర్సన్ ప్రశ్నించగా ... స్పందించాడు సిద్ధు.

' నేను 20ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులతో ఉంటున్నా. ఇక్కడ బిజీగా వర్క్ చేసినప్పుడు.. 2005-11 వరకు కండోమ్ వినియోగంపై అవగాహన కల్పించిన ఏకైక హీరో నేనే. చేతిలో కండోమ్ పట్టుకుని రాష్ట్రంలోని అన్ని బిల్ బోర్డ్స్ పై కనిపించా. సేఫ్ సెక్స్ కోసం కండోమ్ వాడాలని సూచించా. ప్రభుత్వం చేపట్టిన సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో అప్పుడే పాల్గొన్నా. దాన్ని బాధ్యతగా భావించా. అంతేకాదు ప్రతి నటుడు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. తన సినిమాల ద్వారా అవగాహన కల్పిస్తాడు. సమాజానికి మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తాడు ' అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఆన్సర్ కాస్తా మిస్ అండర్ స్టాండ్ చేసుకున్నారని తెలుసుకున్న సిద్ధార్థ్ .. దీనిపై క్లారిటీ ఇచ్చాడు. సీఎం రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ ఇస్తానని.. డ్రగ్స్ వ్యతిరేకంగా జరగుతున్న పోరాటానికి తన పూర్తి మద్దతు ఇస్తానని ప్రకటించాడు.

Advertisement

Next Story

Most Viewed