‘త్రికాల’ టైటిల్ పోస్టర్ రిలీజ్.. విశేషంగా శ్రద్ధాదాస్ లుక్

by sudharani |
‘త్రికాల’ టైటిల్ పోస్టర్ రిలీజ్.. విశేషంగా శ్రద్ధాదాస్ లుక్
X

దిశ, సినిమా: శ్రద్ధాదాస్, అజ‌య్‌, మాస్టర్ మహేంద్రన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా సినిమా ‘త్రికాల’. రిత్విక్ సిద్ధార్థ్ స‌మ‌ర్పణ‌లో మిన‌ర్వా పిక్చర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ భారీ చిత్రాన్ని రాధికా శ్రీనివాస్ నిర్మిస్తుండగా.. మణి తెల్లగూటి దర్శకత్వం వహిస్తున్నారు. ‘స్క్రిప్ట్ ఆఫ్ గాడ్’ అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ మూవీ ఇప్పటికే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాల‌ను పూర్తి చేసుకుంటోంది. భారీ బ‌డ్జెట్‌తో ఫాంటసీ, హార‌ర్ జోన‌ర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కుమారి ఖండాన్ని ప‌రిచ‌యం చేస్తూనే మూల క‌థ‌కు పురాణ నేపథ్యం కొత్తగా ఆవిష్కరించింది చిత్రం టీమ్. స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేలా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.

ఈ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మేకర్స్‌కు, యూనిట్‌కు నా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా తప్పకుండా ఘనవిజయం అందుకోవాలని కోరుకుంటున్నా’ అంటూ తెలిపారు. కాగా.. సాహితి ఆవంచ, త‌నికెళ్ళభ‌ర‌ణి, ఆమని, అర్జున్‌ అంబ‌టి, ఐశ్వర్య, సాయి దీన, రవి వర్మ, రోహిణి, యాదంరాజు, దేవిప్రసాద్‌, నంద దుర‌సిరాజ్‌, వాసువిక్రం, ద‌యానంద్, ఛత్రపతి శేఖ‌ర్‌, అంబ‌టి అర్జున్‌, హేమంత్, షిఫ్ వెంక‌ట్, శ్రీసుధ‌, జీవా, సూర్య, ఈటీవీ ప్రభాకర్ త‌దిత‌రులు కనిపించనున్నారు.

Advertisement

Next Story