నిమిషానికి Allu Arha తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Hamsa |   ( Updated:2023-07-16 05:10:38.0  )
నిమిషానికి Allu Arha తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఇటీవల సమంతతో కలిసి ‘శాకుంతలం’ చిత్రంలో నటించింది. మొదటి సినిమాతోనే అందరినీ మెప్పించింది. ప్రస్తుతం అర్హ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంలో కూడా నటిస్తుందని సమాచారం. వచ్చే నెలలో షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

తాజాగా, అల్లు అర్హు రెమ్మూనరేషన్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అర్హ పాత్ర 10 నిమిషాల పాటు ఉండనుండగా.. మేకర్స్ 1ని.లు దాదాపు రూ. 2 లక్షల రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు పలు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి: షాకింగ్ న్యూస్.. పెళ్లి చేసుకోబోతున్న శ్రీముఖి, ముహుర్తం ఫిక్స్?

Advertisement

Next Story