విడాకుల గురించి షాకింగ్‌ కామెంట్స్: మనీషా కోయిరాలా

by Anjali |
విడాకుల గురించి షాకింగ్‌ కామెంట్స్: మనీషా కోయిరాలా
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు అందాల తారగా పాపులర్‌ అయిన మనీషా కోయిరాలా ‘నెల్లూరి నెరజాణ’ సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తర్వాత తన భర్తతో విడిపోవడం, క్యాన్సర్‌ వ్యాధితో బాధపడడం.. ఇలా చాలా ఇబ్బందులను ఎదుర్కొని.. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో అలరిస్తోంది. ఈ బ్యూటీ నేపాల్‌కి చెందిన సమ్రాట్‌ దహల్‌ అనే వ్యాపార వేత్తను 2010లో పెళ్లి చేసుకుంది. వివాహమయ్యాక 6 నెలలకే భేదాభిప్రాయాలు వచ్చి, దాదాపు సంవత్సరం పాటు పోరాడి 2012లో తన భర్తతో విడాకులు తీసుకుంది. అయితే తాజాగా మనీషా తన వైవాహిక జీవితం గురించి తెలుపుతూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘పెళ్లైన ఆరు నెలలకే మా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎంత సర్దుకుపోయినా ప్రయోజనం లేదని, నన్ను ప్రేమించిన భర్తే నాకు శత్రువుగా మారాడు. దీంతో విడాకులు తీసుకోవడం జరిగింది.

వివాహం తర్వాత ఎన్నో కలలు కన్నాను. అవి కలలాగే మిగిలిపోయాయి. ఇలాంటి సమస్య ఎవరికీ రాకూడదని’’ తెలిపారు. కానీ వీరిద్దరు విడాకులు తీసుకోవడానికి మనీషానే కారణమని, తన భర్త తప్పేమి లేదని ఆమె గతంలో చెప్పారు. సినిమాల విషానికొస్తే... బాంబే’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఈ చిత్రంతో జనాల మనసులో స్థానం సంపాదించుకుంది. 1991లో ‘సౌదాగర్’ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వీటితోపాటు ‘1942 ఎ లవ్ స్టోరీ’, ‘అగ్ని సాక్షి’, ‘గుప్తా’, ‘మన్’ వంటి సినిమాల్లో అద్భుతంగా నటించింది. ఈ మధ్యకాలంలో హిందీలో ‘డియర్‌ మాయా’, ‘లస్ట్ స్టోరీస్‌’, ‘సంజు’, ‘ప్రస్థానం’, ‘మాస్కా’, ‘షేహజాడా’ వంటి చిత్రాల్లో అలరించింది. ఇదిలా ఉంటే.. ఇటీవల రజనీకాంత్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో కలిసి నటించిన ‘బాబా’ చిత్రం ప్లాప్ కావడంతో సౌత్‌లో తన పని అయిపోయిందని, ఆ తర్వాత ఆఫర్లు రాలేదని చెప్పి షాకిచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed