- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నటి లయ వరస ఇంటర్వ్యూల వెనుక ఇంత ప్లాన్ ఉందా.. భారీ స్కెచ్ వేసిదంట!
దిశ, వెబ్‌డెస్క్ : నాటి హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వయం వరం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ. ఎన్నో మంచి మంచి సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
అయితే కెరీర్ బాగా ఉన్న సమయంలోనే లయ సినీ ఇండస్ట్రీకి దూరమైంది. డాక్టర్ గణేష్ గోర్తిని పెళ్లి చేసుకొని అమెరికాలో స్థిరపడింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు లయకు సంబంధించిన ఎలాంటి వార్త చిత్ర పరిశ్రమలో లేదు.
కాగా, ఇటీవల అమెరికా నుంచి వచ్చిన నటి, వరస ఇంటర్వ్యూలు ఇస్తూ అందరినీ షాక్ గురిచేస్తుంది. అంతే కాకుండా ప్రతి నిత్యం ఎదో ఒక వార్తతో వార్తల్లో నిలుస్తుంది. అయితే నటి లయ సడెన్‌గా అమెరికా నుంచి ఊడి పడి, వరస ఇంటర్వ్యూలు ఇవ్వడం వెనుక ఓ కారణం ఉన్నదంట. అది ఏమిటంటే?
లయకు శ్లోకా అనే కూతురు ఉంది. ఆమె లయ మాదిరిగానే చాలా అందంగా ఉంటుంది. తనను హీరోయిన్‌గా పరిచయం చేసేందుకే ఆమె ఈ ప్రయత్నాలు చేస్తుందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే, ఓ ఇంటర్వ్యూలో తన కూతురు శ్లోకాను ఇండస్ట్రీకి తీసుకురావాలని ఉందంటూ మనసులో ఉన్న కోరికను బయట పెట్టిన విషయం తెలిసిందే.