- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గృహ ప్రవేశం రోజే శోభాశెట్టికి తీవ్ర నిరాశ.. ఆ కారణంగానే పూజలకు దూరం
దిశ, సినిమా:మా టీవీలో ప్రసారమయ్యే ‘కార్తీకదీపం’ సీరియల్‌లో విలన్ పాత్రలో మోనితగా మెప్పించిన శోభా శెట్టి.. బిగ్ బాస్ సీజన్-7 తో మరింత క్రేజ్ దక్కించుకుంది. హౌస్‌లో అబ్బాయిలతో సమానంగా ఆడుతూ తన సత్తా చాటింది.. కానీ, ఫైనల్ వరకు వెళ్లలేకపోయింది. అయితే హౌస్‌లో ఉండగా తన ప్రేమ విషయం పంచుకొన్నదని మనకు తెలుసు. కార్తీకదీపం సీరియల్‌లో తనతో పాటు నటించిన యశ్వంత్ రెడ్డితో లవ్‌లో ఉన్నానని బాంబ్ పేల్చి్ంది. ఇటీవలే తన ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న ఈమె తాజాగా గృహ ప్రవేశం కూడా చేసుకుంది. అయితే చాలా ఘనంగా చేసుకున్న ఈ వేడుకకు ఆమె దూరం అయింది. ఆమె లేకుండా ఈ గృహ ప్రవేశ వేడుక జరగగా.. ఆమె ప్రియుడు యశ్వంత్ చాలా ఫీల్ అయ్యాడు.
తాజాగా హైదరాబాద్ లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసిన ఈ జంట రీసేంట్‌గా గృహ ప్రవేశం జరిగింది. అయితే ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా శోభాశెట్టి తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసింది. అయితే చాలా ఘనంగా జరిగిన గృహ ప్రవేశ వేడుకల్లో తాను చాలా బాధ పడుతూ కనిపించింది. తను మాత్రమే కాదు తన ప్రియుడు యశ్వంత్ కూడా చాలా నిరాశకు లోనయ్యాడు. ముఖ్యంగా ముందు పూజలో పాల్గొన్న ఈమె మధ్యలోంచి కనిపించకుండా పోయింది. తనకు గృహ ప్రవేశం పూజ జరుగుతున్న మధ్యలో పీరియడ్స్ వచ్చాయని అందుకే మధ్యలోనే నేను బయటికి వచ్చేసానని చెప్పుకొచ్చింది.