- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సినిమాలకి గుడ్‌బై చెప్పి, బిజినెస్‌మేన్‌ని పెళ్లాడింది.. కట్ చేస్తే ప్రెగ్నెన్సీతో విడాకులిచ్చిన నటి!
దిశ, సినిమా: 2017 లో వచ్చిన ‘మేరీ ప్యారీ బిందు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మాళవిక సిత్లానీ అందరికీ సుపరిచితమే. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ కావడం వల్ల మాళవిక ఇండస్ట్రీని విడిచిపెట్టి, వీడియో వ్లాగింగ్ చేయడం ప్రారంభించింది.2020లో, మాళవిక తన చిరకాల ప్రియుడు, అయాన్ ఎనర్జీ కంపెనీ సహ వ్యవస్థాపకుడు అఖిల్ ఆర్యన్‌ను వివాహం చేసుకుంది. కానీ కొన్ని కారణాల రీత్యా 2023 ఫిబ్రవరిలో, మాళవిక గర్భవతిగా ఉన్నప్పుడు ఈ కపుల్ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కాగా గత ఏడాది మేలో మాళవిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది, ఆమెకు అబిగైల్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈమె మేకప్, చర్మ సంరక్షణలో ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్.
అయితే తాజాగా హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఇంటర్వ్యూలో, ఆమె విడాకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. ఒకరి మీద ఒకరికి చాలా అభిమానం, ప్రేమ, గౌరవం ఉన్నప్పటికీ కొన్ని విభేదాల కారణంగా విడిపోవాల్సి వస్తుంది. మా విషయంలో కూడా అదే జరిగింది. అలాగే మీకు ఇష్టమైన నటులు ఏ సమస్య లేకుండా ఉంటారు అని అనుకోకండి ప్రతి ఒక్కరి లైఫ్ లో కష్ట సుఖాలు ఉంటాాయి. అలాగే నా జీవితంలో కూడా ఉన్నాయి. ప్రస్తుతం వాటి గురించి మాట్లాడాలనుకోవట్లేను అంటూ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం 32 ఏళ్ల మాళవికా సిత్లానీ అందం, లైఫ్‌స్టైల్ బ్రాండ్‌ను మాసిక్ బ్యూటీ పేరుతో రన్ చేస్తుంది. దీనిని ఆమె 2020లో తన బెస్ట్ ఫ్రెండ్ వెరోనికా బహ్ల్‌తో కలిసి స్టార్ట్ చేసింది.