శర్వానంద్‌ పెళ్లి డేట్‌ ఫిక్స్?

by Prasanna |   ( Updated:2023-05-17 07:09:45.0  )
శర్వానంద్‌ పెళ్లి డేట్‌ ఫిక్స్?
X

దిశ, సినిమా: టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌ ఎట్టకేలకు పెళ్లిపీటలెక్కబోతున్నాడు. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ చేసుకోగా మ్యారేజ్‌ డేట్‌ ఫిక్స్ చేసుకున్నాడట. అయితే ఎంగేజ్‌మెంట్‌ జరిగి నాలుగు నెలలు పూర్తి కావస్తున్న ఇంకా మ్యారేజ్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకపొవాడంతో ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ చేసుకున్నాడనే రూమర్స్ వినిపించాయి. అయితే అందులో నిజం లేదని శర్వా సినిమాలతో బిజీగా ఉండటంతో లేట్ అయిందని సన్నిహితులు చెప్పుకొచ్చారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూన్‌ 3న శర్వా పెళ్లి ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభించారట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Read More: శర్వానంద్ పెళ్లి ఆగిపోవడానికి కారణం ఆమేనా?

Samantha :డీజే టిల్లు హీరోతో స‌మంత మూవీ

Advertisement

Next Story