ఆదిపురుష్‌ చిత్ర బృందంపై ‘శక్తిమాన్’ సీరియస్

by GSrikanth |   ( Updated:2023-06-19 11:47:31.0  )
ఆదిపురుష్‌ చిత్ర బృందంపై ‘శక్తిమాన్’ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. విడుదలైన మూడ్రోజులకే ఏకంగా రూ.340 కోట్లు కొల్లగొట్టి మరోసారి తన సత్తా ఏంటో ఇండియన్ బాక్సాఫీస్‌కు ప్రభాస్ గుర్తుచేశారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా.. బాలీవుడ్ నటి కృతి సనన్ సీతగా నటించింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంపై కొందరు విమర్శలు చేస్తుండగా.. మరి కొందరు సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఇది రామాయణమే కాదని.. అంతా ఇష్టం వచ్చినట్లు తీశారని డైరెక్టర్‌పై సోషల్ మీడియా వేదికగా అభిమానులు మండిపడుతున్నారు.

తాజాగా.. ఇండియన్ సూపర్ హీరో ‘శక్తిమాన్’ నటుడు ముఖేష్ ఖన్నా కూడా ఆదిపురుష్ చిత్ర బృందంపై సీరియస్ అయ్యారు. “రామాయణంకి ఆదిపురుష్ కంటే పెద్ద అగౌరవం లేదు. దర్శకుడు ఓం రౌత్ కి ‘రామాయణం’ గురించి అసలు అవగాహన లేదు. ఇక రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా.. గొప్ప బుద్ధిజీవి, త్రేతాయుగ రామాయణాన్ని కలియుగంగా మార్చేలా డైలాగ్స్ రాశాడు. ఆ అర్ధంలేని డైలాగ్ మరియు స్క్రీన్‌ప్లే అందరికీ ఇబ్బంది కలిగించింది. ఇప్పటి వరకు రాసిన రామాయణాలకు ఈ చిత్రానికి అసలు సంబంధం లేదు. టీజర్ తరువాత తప్పులు సరిదిద్దుకొని వెనక్కి వెళ్లి.. కొత్త ట్రైలర్‌తో వెనక్కి వచ్చినప్పుడు కూడా నాకు తప్పులు కనిపించాయి. కానీ ఇక ఆ సినిమా భవిష్యత్తును ప్రజలే నిర్ణయించుకోవాలని అప్పుడు అనుకున్నాను. ఇప్పుడు చూసిన ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు” అంటూ వ్యాఖ్యానించారు.

Also Read,,

‘Adipurush ’ దిమ్మతిరిగే కలెక్షన్స్.. మేకర్స్ అఫీషియల్ ట్వీట్

Advertisement

Next Story