- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిగ్‌బాస్ హౌస్ నుంచి తప్పుకున్న షకీలా.. రెండు వారాలకే తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్ బాస్ సీజన్-7లో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన సినీ నటి షకీలా తాజాగా షో నుంచి ఎలిమినేట్ అయ్యింది. వయసు రీత్యా షకీలా హౌస్‌లో యాక్టీవ్‌గా ఉండలేకపోయింది. బిగ్ బాస్ ఇచ్చిన గేమ్స్‌లో చురుగ్గా పాల్గొనలేకపోయింది. అలాగే ఇంట్లో కంటే స్మోకింగ్ రూంలోనే ఎక్కువగా డిస్కషన్స్ పెట్టింది. హౌస్ మేట్స్‌కు బాగానే దగ్గరయ్యింది. కానీ, ప్రేక్షకులకు మాత్రం చేరువ కాలేకపోయింది. దీంతో ఓటింగ్‌లో వెనకపడి.. రెండో వారమే ఇంటి బాట పట్టింది. అయితే ఈ నటి రెండు వారాలకు గట్టిగానే రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. పాపులరిటీని బట్టీ కంటెస్టెంట్స్‌కు పారితోషికం ఇస్తుంటారని టాక్. కాగా షకీలా వారానికి రూ.3.5 లక్షలు ఫిక్స్ చేశారు. ఇక సెకండ్ వారం ఆమె ఎలిమినేట్ అవ్వడంతో.. బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెకు 7 నుంచి 8 లక్షల రూపాయలు ఇచ్చాడని ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.