షాహిద్‌ కపూర్‌ బ్లడీ డాడీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్ రిలీజ్‌

by Hamsa |   ( Updated:2023-04-13 09:55:23.0  )
షాహిద్‌ కపూర్‌ బ్లడీ డాడీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్ రిలీజ్‌
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హిందీలో తెలుగు సినిమాలను రీమేక్ చేయడంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. విభిన్న మూవీలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల షాహిద్ ‘ఫర్జీ’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఇప్పుడు అలి అబ్బాస్ జఫార్, షాహిద్ కపూర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘బ్లడీ డాడి’. తాజాగా, ఈ సినిమా పోస్టర్‌ను షాహిద్ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. అందులో రక్తపు మరకలతో షాహిద్ కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా ‘త్వరలో టీజర్ త్వరలో రక్తికట్టనుంది’ అంటూ రాసుకొచ్చాడు. కాగా ఈ సినిమా నేరుగా జియో సినిమా ఓటీటీలో జూన్‌ 9 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఇవి కూడా చదవండి: కోలివుడ్ దర్శకుడు లింగుసామికి జైలు శిక్ష..

Advertisement

Next Story

Most Viewed