- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నెపోటిజం, ఫేవరేటిజం.. ఇండస్ట్రీకి అతిపెద్ద సమస్యలు
దిశ, సినిమా : బాలీవుడ్ నటి షహానా గోస్వామి ఇండస్ట్రీ నెపోటిజం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సినీ పరిశ్రమలో కొంతకాలం బంధుప్రీతితోపాటు ఫేవరేటిజం కూడా అతిపెద్ద సమస్యగా మారిందన్న ఆమె.. ఇప్పుడు ఆ పరిస్థితులు కాస్త తగ్గినట్లు కనిపిస్తుందని చెప్పింది. ఎందుకంటే స్టార్ కిడ్స్ కంటే బయటి నుంచి వచ్చిన వ్యక్తుల యాక్టింగ్, డ్యాన్స్‌ను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు గమనించానని తెలిపింది.
అలాగే ఈ రోజుల్లో ఇండస్ట్రీకి ఎంటరయ్యే వాళ్లు మోస్ట్ టాలెంటెడ్ అయి ఉంటున్నారన్న నటి.. ఇండస్ట్రీలో ప్రత్యేక వ్యవస్థ లేదని, పాశ్చాత్య దేశాల్లో మాత్రం మనకన్నా భిన్నమైన సంస్కృతి, పోటి ఉంటుందని వెల్లడించింది. ఇక సినీ పరిశ్రమలో అదృష్టవంతులుంటారనే నిజాన్ని అంగీకరిస్తున్నానన్న షహానా.. 'నేను ఎక్కడి నుంచో వచ్చాను. నాకు మొదటి ఆడిషన్‌లోనే పని దొరికింది. నేను సరైన సమయంలో సరైన స్థలంలో ఉన్నానని భావించాను. నిజంగా ఇదొకరకమైన అదృష్టమే' అంటూ తన అభిప్రాయాలను వెల్లడించింది.
ఇవి కూడా చదవండి : దాన్ని ఆడవాళ్లు స్వార్థానికి వాడేస్తున్నారు.. పూనమ్ కౌర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్