Ram Charan. : చరణ్‌పై షారుఖ్ క్రేజీ కామెంట్స్.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

by Prasanna |   ( Updated:2023-02-08 15:48:43.0  )
Ram Charan. : చరణ్‌పై షారుఖ్ క్రేజీ కామెంట్స్.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: " ఆర్ఆర్ఆర్ " మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్. దీంతో వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో " #RC 15 " సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలావుంటే..చరణ్‌పై బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'పఠాన్' ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన షారుఖ్..ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ గురించి ఒక్కమాటలో చెప్పండి అంటూ ఫ్యాన్ అడగగా 'చరణ్ నా ఓల్డ్ ఫ్రెండ్. మా పిల్లలకు తనంటే చాలా ఇష్టం' అని చెప్పడంతో చెర్రీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Advertisement

Next Story