- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rashi : ఆయన రియల్ క్యారెక్టర్ ఇది అంటూ.. Pawan Kalyan గురించి ఆసక్తికర వ్యాఖ్యలు...
దిశ,వెబ్ డెస్క్: సీనియర్ హీరోయిన్ రాశి మనకందరికీ తెలిసే ఉంటుంది. ప్రస్తుతం జానకి కలగనలేదు సీరియల్లో నటిస్తుంది. ఈమె తాజా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘గోకులంలో సీత’ సినిమా తరువాత మళ్లీ పవన్ కళ్యాణ్ గారిని కలిశాను. ఇప్పుడు పవర్ స్టార్ పెద్ద స్టార్ అయిపోయారు. ఇప్పుడు ఆయన్ని కలవాలంటే.. ఆయన చుట్టూ చాలా మంది ఉంటారు. వాళ్లందర్నీ దాటుకుని వెళ్లాలి.
నా కూతురి పుట్టిన రోజుకు పిలవడానికి వెళ్లాను. ఆయన నా కో స్టార్ కదా.. అపాయింట్‌మెంట్ అవసరం ఉండదులే అని.. నేను డైరెక్టుగా ఆయన ఉన్న షూటింగ్ లొకేషన్‌కి వెళ్లిపోయాను. నేను వెళ్లకుండా కారులో కూర్చుని.. మా డ్రైవర్‌ని పంపించాను. ఒకవేళ అపాయింట్‌మెంట్ లేకపోతే వెనక్కి వెళ్లిపోదాం అని అన్నాను. మా డ్రైవర్ వెళ్లి చెప్పగానే.. పవన్ కళ్యాణ్ గారు.. ఆవిడని వెంటనే పిలవండి.. నాకు చెప్పకుండా.. ఎందుకు ఆవిడని అంతసేపు వెయిట్ చేయించారని అన్నారు. నాకు వెల్కమ్ చెప్పి.. కూర్చోబెట్టి దాదాపు 20 నిమిషాలు మాట్లాడారు. ఇద్దరం కలిసి ‘గోకులంలో సీత’ సినిమా విషయాలు మాట్లాడుకున్నాం.. ఆయనది ఎంత గొప్ప సంస్కారం అంటే.. మళ్లీ నన్ను కారు వరకూ వచ్చి పంపించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ ది. అందర్ని గౌరవిస్తారు' అంటూ తన మాటల్లో చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : బాలయ్య బాబు రియల్ క్యారెక్టర్ ఇదే.. బయటపెట్టిన విజయ్ దేవరకొండ