‘రా మ‌చ్చా మ‌చ్చా’.. ‘గేమ్ ఛేంజర్’ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో

by sudharani |
‘రా మ‌చ్చా మ‌చ్చా’.. ‘గేమ్ ఛేంజర్’ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్పణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్షన్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. 2024 క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న ఈ మూవీ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. దీంతో ఈ మూవీ నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ కోసం ఫ్యాన్‌తో పాటు సినీ లవర్స్ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా మేక‌ర్స్ మూవీ నుంచి మ‌రో క్రేజీ అప్‌డేట్‌ను ఇచ్చేశారు. సెప్టెంబ‌ర్ 28న సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘రా మ‌చ్చా మ‌చ్చా’ ప్రోమో విడుద‌ల చేయ‌బోతున్నట్లు మేక‌ర్స్ తెలియ‌జేశారు. ఇప్పటికే ‘గేమ్ చేంజర్’ నుంచి వచ్చిన ‘జరగండి జరగండి..’ పాట ఎంత సెన్సేష‌న్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. తాజాగా సెకండ్ సాంగ్‌కు సంబంధించిన అప్‌డేట్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ స‌రికొత్త ఎన‌ర్జీనిచ్చింది. కాగా.. ఈ చిత్రంలో అంజ‌లి, సముద్రఖ‌ని, ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, జయరాం, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Next Story

Most Viewed