కోటీశ్వరుల సంబంధాలకు నో చెప్పి.. అతన్నే పెళ్ళాడిన స్టార్ హీరోయిన్

by Prasanna |
కోటీశ్వరుల సంబంధాలకు నో చెప్పి.. అతన్నే పెళ్ళాడిన  స్టార్ హీరోయిన్
X

దిశ,సినిమా: ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్స్ బిజినెస్ చేసే వాళ్ళను పెళ్లిచేసుకుంటున్నారు. కానీ, కొందరు మాత్రం సినిమా వాళ్లనే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీ ఏదైనా ఇదే ట్రెండ్ నడుస్తుంది. ఈ ముద్దుగుమ్మ దగ్గరకు కోటీశ్వరుల సంబంధాలు ఎన్ని వచ్చిన నో చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది. ఆమె ఎవరో కాదు..సీనియర్ స్టార్ హీరోయిన్ రాశి.

ఒకప్పుడు రాశి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. ఈమె నటించిన సినిమాల్ని హిట్ గా నిలిచాయి.దేవి అభయం అనే మూవీ తర్వాత ఇంక ఏ సినిమాలలో కనిపించలేదు. చాలా కాలానికి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. సినిమాలు మాత్రమే కాకుండా సీరియల్స్ లో కూడా మెరిసింది. జానకి కనగనలేదు సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఈమె రియల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే కోటీశ్వరుల సంబంధాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చినా అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్ళాడింది. ఎస్.ఎస్. నివాస్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది రాశి. అప్పట్లో ఇతను ఆమె సినిమాలకు అసిస్టెంట్‌గా వర్క్ చేసాడు. ఆ టైంలోనే ఈ ఇద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొంత కాలానికి తండ్రి చనిపోయారు.. ఆతర్వాత రాశికి దగ్గరకు కోటీశ్వరుల, వ్యాపారవేత్తల నుంచి మ్యాచ్ స్ వచ్చాయి .. అయితే, ఆమె నివాస్ ను ఇష్టపడడంతో డైరెక్ట్ గా ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందని ఓ ఇంటర్వ్యూలో రాశి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ మాటలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

Advertisement

Next Story