మా బలానికి ప్రతిరూపం అమ్మనే.. సారా అలీఖాన్

by Aamani |   ( Updated:2023-05-21 13:13:20.0  )
మా బలానికి ప్రతిరూపం అమ్మనే.. సారా అలీఖాన్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ తన సోదరుడు ఇబ్రహీం.. నటుడిగా మొదటి చిత్రం షూటింగ్ పూర్తి చేసినట్లు తెలిపింది. ఈ మేరకు కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ సెట్స్‌లో కరణ్‌కు నిర్మాణ బాధ్యతల్లో సహాయం చేస్తున్న ఇబ్రహీం.. ఇందులో ఓ కీ రోల్ పోషించాడట. కాగా ఈ మూవీ షూటింగ్ ముగిసిన సందర్భంగా సోదరుడికి ఆల్ ది బెస్ట్ చెప్పిన సారా.. ‘మీకు తెలుసా నటుడిగా తన మొదటి సినిమా షూటింగ్ పూర్తిచేశాడు. నిజంగా నేను ఇది నమ్మలేకపోతున్నా. అతను ఇంటికి వచ్చినప్పుడల్లా చాలా ప్రేమను పంచుకుంటాం. మాకు మా అమ్మ అమృతా సింగ్‌లాంటి హృదయం ఉందని నేను గ్రహించాను. ఒకరిపట్ల ఒకరం ప్రేమగా వ్యవహరిస్తాం. మా బలానికి ప్రతిరూపం మా అమ్మే’ అంటూ తల్లి, సోదరుడిని తలుచుకుంటూ మురిసిపోయింది సారా.

Also Read...

చై-సామ్ కంటే బిచ్చగాడు బెటర్.. నెట్టింట నెటిజన్ల రచ్చ

Advertisement

Next Story