Sara Ali Khan : చిన్న హోటల్‌లో బస చేస్తోన్న సారా.. షాక్‌లో నెటిజన్లు!!

by Anjali |   ( Updated:2024-02-25 16:06:41.0  )
Sara Ali Khan : చిన్న హోటల్‌లో బస చేస్తోన్న సారా.. షాక్‌లో నెటిజన్లు!!
X

దిశ, సినిమా: సైఫ్ అలీ ఖాన్ డాటర్ సారా అలీఖాన్ గురించి సుపరిచితమే. తండ్రి ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. ఇకపోతే సారా తరచూ ఏదో ఒక వార్తతో వార్తల్లో నిలుస్తుంటుంది.

తాజాగా సారా నెటిజన్ల చే ప్రశంసలు అందుకుంటుంది. ఎందుకంటే.. ఈ హీరోయిన్ ఎటు వెళ్లినా తక్కువ మొత్తంలో ప్రయాణం చేస్తుందట. రూ. 500 ల్లోనే ఏ ప్రదేశమైనా చుట్టి రాగలనని తాజాగా సారా అలీఖాన్ చెప్పడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఎక్కడికెళ్లినా తక్కువ కాస్ట్ బట్టలే వేసుకుంటానని తెలిపింది. చిన్న హోటల్‌లో బస చేస్తానని వెల్లడించింది. ప్రస్తుతం సారా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఇంత సింపుల్ గా ఉండడం కేవలం సారాకే సాధ్యమవుతుందని స్టార్ కిడ్ ను కొనియాడుతున్నారు. ప్రస్తుతం సారా సింప్లిసీటికి జనాలు ఫిదా అవుతున్నారు.

Advertisement

Next Story