పృథ్వీషా నా ప్రైవేట్ పార్ట్స్ తాకాడు: నటి సంచలన ఆరోపణలు

by Vinod kumar |   ( Updated:2023-05-19 13:20:09.0  )
పృథ్వీషా నా ప్రైవేట్ పార్ట్స్ తాకాడు: నటి సంచలన ఆరోపణలు
X

దిశ, సినిమా: ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షాపై భోజ్‌పురి నటి సప్నా గిల్ సంచలన ఆరోపణలు చేసింది. ఇటీవల రెండు గ్రూపుల మధ్య చోటుచేసుకున్న సెల్ఫీ ఇష్యూతో మొదలైన గొడవ పలు మలుపులు తిరుగుతోంది. పృథ్వీషా ఇచ్చిన కంప్లయింట్ మేరకు సప్నా గిల్‌తో పాటు మరో ఏడుగురిపై ఓషివారా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన సప్నా.. షాకింగ్ స్టేట్‌మెంట్స్ ఇచ్చింది. 'నిజానికి నా ఫ్రెండ్స్ పృథ్వీ ని కొట్టలేదు. సెల్ఫీ మాత్రమే అడిగారు. ఆయన దురుసు ప్రవర్తన వల్లే ఈ గొడవ పెద్దదైంది.

ఒకరిపై ఒకరు దాడి చేసుకోడాన్ని ఆపేందుకు నేను అక్కడికి వెళ్లాను. అయితే రుజువు చూపించడానికి నా స్నేహితుడు వీడియో చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే పృథ్వీ నన్ను బేస్ బాల్‌తో కొట్టాడు. పబ్లిక్ ప్లేస్ లో మారణాయుధాలతో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అడ్డుకోవానికి వెళితే నా ప్రైవేట్ పార్ట్స్ తాకడంతోపాటు నన్ను చెంపదెబ్బలు కొట్టాడు' అంటూ వివరించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story