- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాస్త ఇంగితజ్ఞానంతో మాట్లాడండి: నెటిజన్లపై Jasprit Bumrah భార్య ఫైర్
దిశ, సినిమా : ప్రముఖ టీవి ప్రజెంటర్, మోడల్, క్రికెటర్ బుమ్రా భార్య సంజనా గణేశన్ నెటిజన్లపై ఫైర్ అయింది. ఇటీవల ఆసియా కప్‌లో భాగంగా ఓ మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోయింది. అయితే ఇదే సమయంలో విహారయాత్రకు వెళ్లిన ఫొటోలను ఆమె నెట్టింట పోస్ట్ చేయడంతో ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్.. 'అక్కడ భారత జట్టు కష్టాల్లో ఉంటే.. మీరు సెలవులో ఎంజాయ్ చేస్తున్నారా' అంటూ ట్రోలింగ్‌కు దిగారు. దీంతో విమర్శకులకు తనదైన స్టైల్లో చురకలంటించిన సంజన.. 'ఇంటర్నెట్ ట్రోలింగ్, బెదిరింపులకు వ్యతిరేకంగా నిలబడటం చాలా ముఖ్యమని భావిస్తున్నా.
ఒకరి మతం, జాతీయత, జాతి లేదా గుర్తింపును ఇలాంటి విషయంలోకి లాగడాన్ని అంగీకరించను. ఇది కేవలం ఇంగితజ్ఞానం లేకపోవడం మాత్రమే అవుతుంది. మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతున్నదొక్కటే. సంబంధం లేని విషయాల గురించి విమర్శించడం మానుకోండి. ఇంటర్నెట్ను మెరుగైన ప్రదేశంగా మార్చడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటానని హామీ ఇస్తున్నా. లవ్ సంజన' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
Also Read : పెళ్లికి సిద్ధమైన మరో స్టార్ జోడీ.. ఆ లగ్జరీ బంగ్లాలోనే