Sangeetha: నేను హీరోయిన్ అంటే ఎవరూ నమ్మలేదు.. ఎగతాళి చేశారంటున్న సంగీత

by Prasanna |   ( Updated:2023-03-01 07:48:19.0  )
Sangeetha: నేను హీరోయిన్ అంటే ఎవరూ నమ్మలేదు.. ఎగతాళి చేశారంటున్న సంగీత
X

దిశ, సినిమా : ప్రముఖ సీనియర్ నటి సంగీత తన కెరీర్ స్ట్రగుల్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘పెళ్ళాం ఊరెళ్తే’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో హీరోయిన్‌కు తల్లిగా, విజయ్ ‘వారసుడు’లో వదినగా నటించి మెప్పించింది. ఇదిలావుంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కెరీర్ అనుభవాలను పంచుకున్న ఆమె.. ‘కృష్ణవంశీ ‘ఖడ్గం’ మూవీలో పోషించిన పాత్ర వన్ ఆఫ్ ది హైలైట్. కానీ, ఇందులో నా మేకప్ నాకు పెద్ద మైనస్ అయింది. ఆ మేకప్‌లో నన్ను నేను చూసుకోలేకపోయా. అన్నపూర్ణ స్టూడియోస్ గేటు దగ్గర షూటింగ్ చేశారు. షూటింగ్ అయిపోయిన తర్వాత చిత్రయూనిట్ అంతా వచ్చి చాలా బాగా వచ్చిందన్నారు. అయితే అక్కడున్న జనాలు మాత్రం కృష్ణవంశీకి పిచ్చి పట్టిందా? ఆ అమ్మాయి హీరోయిన్ ఏంటి? అని ఎగతాళి చేశారు. చివరికి సినిమా బిగ్ హిట్ అవడంతో నాకు మంచి పేరు వచ్చింది’ అంటూ పలు విషయాలను గుర్తుచేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed