ప్రభాస్‌కు జోడీగా సమంత.. సినిమా టైటిల్ కూడా ఫిక్స్?

by sudharani |
ప్రభాస్‌కు జోడీగా సమంత.. సినిమా టైటిల్ కూడా ఫిక్స్?
X

దిశ, సినిమా: అనారోగ్య కారణాలతో గత కొంత కాలంగా సినిమాల్లో వేగం తగ్గించారు కథానాయిక సమంత. అయితే ఇప్పటి వరకు తెలుగులో ఆమె ఏ సినిమా అంగీకరించలేదు. ప్రస్తుతం పూర్తిగా ఫిట్‌ నెస్‌పై దృష్టి పెట్టిన ఈ అందాలభామ త్వరలోనే ప్రభాస్‌ సరసన ఓ చిత్రంలో నటించనున్నారని తెలిసింది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్‌ చిత్రంలో నటిస్తున్న ప్రభాస్‌ త్వరలోనే హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం షూటింగ్‌లో పాల్గొంటాడు. ఇటీవల గ్రాండ్‌గా ఓపెనింగ్‌ జరుపుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి నిర్మించనున్నారు.

ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌ ప్రభాస్‌కు జోడిగా కనిపించబోతున్నారు. ఇందులో ఓ హీరోయిన్‌గా ఇమాన్విని ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా సమంత పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. ఇప్పటి వరకు ప్రభాస్‌-సమంత కలయికలో సినిమా రాలేదు. ఈ ఇద్దరి పెయిర్‌ ఫ్రెష్‌గా ఉంటుందని అందుకే సమంతను ఒప్పించే పనిలో దర్శక నిర్మాతలు ఉన్నారట. సమంత కూడా ఓ స్టార్‌ హీరో పక్కన కనిపించి చాలా రోజులయ్యింది. అందుకే సమంత కూడా దాదాపుగా ఓకే చెప్పినట్లుగా ఫిల్మ్‌నగర్‌ టాక్‌. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కూడా రానుంది.


Read More...

ఇక నో ఐటెమ్ సాంగ్స్‌.. కీలక నిర్ణయం తీసుకున్న స్టార్ హీరోయిన్!

Advertisement

Next Story

Most Viewed