- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగచైతన్యకు రాఖీ కడతానన్న సమంత.. షాక్లో చైతూ ఫ్యాన్స్!
దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరో సమంత, నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరు విడాకులు తీసుకున్నప్పటి నుంచి వీరికి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, వీరికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.
ఏమాయ చేసావే సినిమాతో సమంత,నాగచైతన్య ఇద్దరూ వెండితెరకు పరిచయమయ్యారు. అంతే కాకుండా ఈ సినిమా టైమ్లోనే ఇద్దరూ ప్రేమలో పడినట్లు కూడా సమాచారం. అయితే వీరు చాలా సీక్రెట్గా ప్రేమ వ్యవహారం నడిపించారు. కానీ సామ్ స్టార్ హీరోయిన్గా ఎదిగే సమయంలో వీరికి సంబంధించిన లవ్ మ్యాటర్ బయటకు వచ్చేసిందంట. టాలీవుడ్లో చాలా మందికి వీరి ప్రేమ గురించి తెలియడంతో, సమంత ఓ రోజు చైతూని తన ఇంటికి పిలిపించుకొని క్లాస్ ఇచ్చిందంట. అంతా మన గురించే మాట్లాడుకుంటున్నారు. మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పిందంట. కానీ చైతూ మాత్రం ఇప్పుడు వద్దే వద్దు మా ఇంట్లో వారికి మన విషయం చెప్పలేదంటూ చెప్పుకొచ్చారంట. దీంతో ఆగ్రహానికి గురైన సమంత నేను నీకు ఇప్పుడే రాఖీ కట్టేస్తాను, నువ్వు నాకు మూడు ముళ్లు వేయకపోతే అంటూ బెదిరించిందంట. దీంతో భయపడిపోయిన చైతూ ఫ్యామిలీని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఇది చూసిన నాగచైతన్య ఫ్యాన్స్ సమంత అలా బెదిరించిందా అంటూ షాక్ అవుతున్నారు.