Samantha : చాలా రోజుల తర్వాత ఓటీటీలోకి రానున్న సమంత వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

by Jakkula Samataha |
Samantha : చాలా రోజుల తర్వాత ఓటీటీలోకి రానున్న సమంత వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
X

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ నాగచైతన్యతో విడాకుల నుంచి ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది. ఇక డివోర్స్ తర్వాత సమంత మానసికంగా చాలా కుంగిపోయింది. ఆ సమయంలోనే మయోసైటీస్ రావడంతో ఈ నటి డిప్రషెన్‌‌లోకి వెళ్లిపోయింది. వ్యాధి నయం కావడానికి కొన్ని రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకొని, తర్వాత ఆ జబ్బు నుంచి బయటపడింది. ఆ తర్వాత కూడా తాను మెంటల్‌గా స్ట్రాంగ్ అవ్వడానికి కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి వెకేషన్స్ ఎంజాయ్ చేసింది. ఇక ఇప్పుడిప్పుడే సమంత వెబ్ సిరీస్, సినిమాలు చేస్తూ మళ్లీ స్పీడ్ పెంచింది.

ఇక విడాకుల తర్వాత సమంత సిటాడెల్ అనే హిందీ వెబ్ సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే. హాలీవుడ్‌లో ఆల్రెడీ తెరకెక్కించిన సిటాడెల్ హనీ ని సీరిస్‌ను సమంత లీడ్ రోల్‌లో హిందీ వెర్షన్‌లో రీమెక్ చేశారు. కాగా, ఇప్పటికీ ఈ సిరీస్ షూటింగ్ పూర్తై చాలా రోజులు అవుతుంది. దీంతో చాలా మంది ఇది ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ సిరీస్ రిలీజ్ పై ఎలాంటి అప్డేట్ లేకుండా పోయింది. కాగా, దీనిపై తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. సిరీస్ దర్శకులు, కంటెంట్ క్రియేటర్స్ రాజ్ అండ్ డీకేలు ఆగస్టు 1 అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఆగస్టు ఫస్ట్ నుంచి సమంత వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో రాబోతుందని టాక్. కానీ సిరీస్‌ను ఆ రోజే రిలీజ్ చేస్తారా లేక, రిలీజ్ చేసే డేట్‌ను ఆరోజు ప్రకటిస్తారా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Read more...

Mehreen Pirzada: వాటిని ప్రమోట్ చేస్తున్న యంగ్ బ్యూటీ.. అవి డ్యామేజ్ కావంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్



Next Story