విదేశాల నుంచి తిరిగి వచ్చేసిన Samantha..(వీడియో) సినిమాలు ఒకే చేస్తుందా?

by Hamsa |   ( Updated:2023-10-21 02:45:19.0  )
విదేశాల నుంచి తిరిగి వచ్చేసిన Samantha..(వీడియో) సినిమాలు ఒకే చేస్తుందా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది కాలంగా మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల మొత్తానికి సినిమాలకు బ్రేక్ ఇచ్చి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూనే వ్యాధికి చికిత్స తీసుకుంటుంది. అమెరికాలో ఆమె చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

తాజాగా, సామ్ విదేశాల నుంచి ఇండియా తిరిగి వచ్చేసింది. దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఈ అమ్మడు ల్యాండ్ అయింది. బ్లాక్ అవుట్ ఫిట్‌లో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో అది చూసిన నెటిజన్లు సామ్ మయోసైటీస్ నుంచి కోలుకుందని ఖుషీ అవుతున్నారు. అలాగే మళ్లీ సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటుందా? లేదా అని కామెంట్లు చేస్తున్నారు. ఇక సమంత యాక్టింగ్‌ను తిరిగి ఎప్పుడు స్టార్ట్ చేస్తోందా? అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story